telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బంపర్ ఆఫర్‌ ప్రకటించిన వొడాఫోన్, ఐడియా..రీచార్జికీ బహుమతులు!

vodafone idea offer

తన కస్టమర్ల కోసం వొడాఫోన్,  ఐడియా బంపర్ ఆఫర్‌ను ప్రకటించాయి. ఈ నెట్‌వర్క్‌లకు చెందిన వినియోగదారులు ఎంత చిన్న మొత్తం లేదా పెద్ద మొత్తంలో ప్రీపెయిడ్ రీచార్జిలు చేసుకుంటే కచ్చితమైన బహుమతిని పొందవచ్చు. అదనపు డేటా, కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, కాలర్ ట్యూన్స్ రూపంలో ఆ బహుమతులు వస్తాయి.

ఇందుకు గాను కస్టమర్లు రీచార్జి చేసుకున్న వెంటనే మై ఐడియా యాప్‌లోకి లేదా *999# నంబర్ డయల్ చేసి తమకు లభించిన గిఫ్ట్‌ను పొందవచ్చు. ఇందుకు కస్టమర్లకు రీచార్జి చేసుకున్నాక 72 గంటల వరకు సమయం ఉంటుంది. ఆలోగా గిఫ్ట్‌ను వారు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా కస్టమర్లు ఎంత పెద్ద మొత్తం రీచార్జి చేసుకుంటే అంత ఎక్కువ పెద్దదైన బహుమతిని పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ సెప్టెంబర్ మొదటి వారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయా కంపనీల ప్రతినిధులు తెలిపారు.

Related posts