telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కాడెద్దులు లేక కాదు..సరదాగా వీడియో తీసుకున్న అక్కా చెల్లి..సోనూసూద్ దాతృత్వం వృథా

Bulls or not..Akka sister who took fun video..Sonusood's generosity is in vain

మీడియా ఎంత పని చేసింది? ఏదో తమ పొలంలో ఆరోజు వేరుశనగ విత్తుతుండగా. .. ఆ తండ్రీ కూతుళ్లు సరదాగా వీడియో తీసుకున్నారు. వాళ్ల కుటుంబానికి తెలిసిన వ్యక్తి ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని మరో కోణంలో అలోచించింది. కాడెద్దులకు కూడా స్తోమత లేక రైతు తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మార్చాడని కథనాలు వండి వార్చింది. అక్కాచెల్లెలు ఏదో ఒక జ్ఞాపకం లా ఉంటుందని పొలంలో అలా వీడియో తీసుకుంటే అందరికీ ఇంకోలా అర్థమైంది. వారు సరదా కోసం చేసిన పని అని తెలియడంతో నటుడు సోనూసూద్ చేసిన సాయం వృథా అయిపోయింది. ఇలాంటి పనుల వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయం తెలిసిన వారు నిట్టూరు స్తున్నారు. చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం మహరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా చేసి వేరుశనగ విత్తనాలను విత్తగా..ట్విట్టర్ లో ఆ వీడియో చూసిన ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చలించిపోయాడు. సాయంత్రానికల్లా ఆ రైతు కుటుంబానికి ట్రాక్టర్ ను బహుమతిగా అందజేశాడు. అయితే రైతు పేదోడు కాదని, ఈ ఉదంతం జరిగిన తర్వాత నిజాలు బయటకు వచ్చాయి. అతడు ఆంధ్రా, తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకుడని, గతంలో లోక్ సత్తా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడని తెలిసింది. ఆయన సొంతూరు విడిచి మదనపల్లెలో నివాసం ఉండేవాడు. ఆ పట్టణంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో సొంతూరులో సేఫ్ గా ఉండొచ్చని గ్రామానికి కుటుంబంతో తిరిగి వచ్చాడు. ఎలాగూ ఊర్లో ఉన్నాం..వర్షాలు కూడా కురిశాయని తనకున్న పొలంలో వేరుశనగ విత్తనాలు విత్తాడు. ఆరోజు పొలం వద్దకు సరదాగా వచ్చిన నాగేశ్వరావు కుమార్తెలు నాగలి పట్టి సరదాగా విత్తనాలు విత్తారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, అది చూసి న్యూస్ ఛానెళ్ల వాళ్ళు రైతు కష్టం గురించి కథనాలు ఇచ్చారు. ఈ వీడియోలు చూసిన సోనూ సూద్
అదంతా నిజమని భావించి సాయంత్రంలోపే ఆ రైతుకు ట్రాక్టర్ ను బహుమతిగా పంపాడు. మాజీ సీఎం చంద్రబాబు స్పందించి, ఆ రైతు పిల్లల చదువు బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. నిన్నంతా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో సీఎం ఆఫీస్ నుంచి స్థానిక ఎంపీడీవోకు ఫోన్ వచ్చింది. ఆయన వివరాలు కనుక్కొని తగిన సాయం అందజేయాలని రైతు నాగేశ్వరరావు ఇంటి వద్దకు వెళ్ళాడు.
విచారణలో వాళ్ళు సరదాగా వీడియోలు తీసుకున్నట్లు తెలిసి ఖంగుతిన్నాడు.
ఈ విషయాలన్నీ బయటకు రావడంతో ఆ ట్రాక్టర్ నిజమైన పేద రైతుకు అంది ఉంటే వ్యవసాయ అభివృద్ధికి వినియోగించుకునే వాడని, అప్పుడు సోనూసూద్ దాతృత్వానికి విలువ ఉండేదని జనం నిట్టూరుస్తున్నారు. అయితే దీని గురించి స్థానికులు మరోలా చెబుతున్నారు. ఆ రైతు కుటుంబీకులు చాలా మంచోళ్ళని, మీడియానే తప్పుగా అర్థం చేసుకొని హైలెట్ చేసిందని చెప్పారు. ఆ ట్రాక్టర్ ను తిరిగి ఇచ్చేయడమో, లేకుంటే పంచాయతీకి అప్పజెప్పడమో చేయాలని వారు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు

Related posts