telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరానికి… బడ్జెట్ తో సంబంధం ఉండదు.. : జీవీఎల్

gvl comments on tdp

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని అన్నారు. రాష్ట్రాల అంశాల ప్రతిపాదికన బడ్జెట్‌ను చూడటం సరికాదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయపన్ను వ్యవస్థను సరళీకృతం చేసేలా బడ్జెట్‌ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను శాతాన్ని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ను అమరావతిలో పెట్టాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.

పోలవరం ప్రాజక్టుకు కేంద్ర బడ్జెట్‌కు సంబంధం లేదని చెప్పారు. అందుకు నాబార్డ్‌ ద్వారా కేంద్రం నిధులిస్తుందన్నారు. పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మౌలిక వసతుల కల్పనకు సమాకూర్చానున్నామని తెలిపారు.

Related posts