telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు

Hyderabad Police Seize Three Crores

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు మూడు శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 6 శ్లాబులుగా విస్తరించారు.

రూ.0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదని తెలిపారు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను విధించారు.

Related posts