telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి రుత్విక్ అనే బీటెక్ విద్యార్థి బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

రుత్విక్ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఆత్మహత్యకు మరేదైనా కారణముందా అనేది తేలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం రుత్విక్ స్నేహితులను కూడా విచారిస్తున్నారు.

Related posts