telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

మూడు రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్త సమ్మె

BSNL Employees Strike three days

భారత టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నేటి నుంచి దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. విశేష సేవలందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి కుట్ర పన్నుతోందని ఆ సంఘ నాయకులు సమ్మెకు పూనుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణ కోసం ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆల్‌ యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ హైదరాబాద్‌ టెలికం జిల్లా నాయకులు మోహన్‌రెడ్డి, ముత్తు, పి.వెంకటేశ్వర్‌, రమేష్‌ కోరారు.

2002లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ సర్వీసులు ప్రారంభించినందునే టెలికం సేవల రేట్లు తగ్గాయని, ఇంటర్నెట్‌ సేవలు దేశ వ్యాప్తంగా విస్తరించడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ కారణమని వారు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీఎస్‌ఎన్‌ఎల్‌ను నష్టాల ఊబిలోకి నెట్టి, ప్రైవేటు టెలికం కంపెనీలకు అనుచిత రాయితీలు ఇస్తూ ప్రోత్సహించాయని వారు ఆరోపించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణ, వేతన సవరణ, పెన్షన్‌ సవరణ తదితర డిమాండ్లను నెరవేర్చాలని దేశ వ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు యూనియన్‌ నాయకులు వెల్లడించారు

Related posts