telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

జియో కి ధీటుగా … బీఎస్ఎన్ఎల్ తాజా ఆఫర్లు…

bsnl plan upgration as compete with jio

టెలికాం రంగంలో జియో సంచలనాలు సృష్టించడంలో ఎప్పుడూ ముందుంటుంది. డేటా ప్రపంచంలో జియో ని డీ కొట్టే పరిస్థితి ఏ నెట్వర్క్ కి లేదనుకుంటున్న తరుణంలో ఒక్క సారిగా జియో కి షాక్ ఇస్తూ బీఎస్ఎన్ఎల్ కళ్ళు చెదిరేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంతటి ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా సరే తన విలువైన కష్టమర్లని పోగొట్టుకోవడానికి సిద్దంగా లేమని భావించిన బీఎస్ఎన్ఎల్ అందుకు తగ్గట్టుగా సరికొత్త డేటా ప్లాన్స్ ని విడుదల చేసింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ తమ ఖాతా దారుల కోసం 151 అభినంధన్ ప్లాన్ ని ప్రవేసపెట్టింది.ఈ ప్లాన్ ద్వారా ప్రీ పైడ్ యూజర్స్ వాయిస్ కాల్స్ తో పాటు డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

మార్కెట్లో డేటా ఆఫర్స్ కి పోటీగా ఈ తాజా ఆఫర్ ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. గతంలో మొత్తం వ్యాలిడిటీ తో 1 జీబీ డేటా అందించిన కంపెనీ ఇప్పుడు అదే డేటాని 1. 5జిబీ కి పెంచింది. ఇదిలాఉంటే మరో వైపు రిలయన్స్ జియో 148 రూపాయలకే 1. 5జిబీ ని అందిస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జియో 4G డేటాని జియో మాత్రమే అందిస్తుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం 3G డేటాని అందిస్తోంది. కొన్ని కొన్ని చోట్ల మాత్రం బీఎస్ఎన్ఎల్ 4G డేటాని అందించడం కొంత వెనుకబడుతోందనే చెప్పాలి. ఏది ఏమైనా డేటా దిగ్గజానికి బీఎస్ఎన్ఎల్ మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

Related posts