telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్‌..జీతాలు ఇవ్వలేమంటున్న అధికారులు!

bsnl monsoon offers for prepaid customers

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేమంటూ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తమకు ఆర్థిక సాయం చేయకుంటే సిబ్బంది జూన్‌ నెల జీతాల చెల్లింపు కష్టమేనంటోంది. చెల్లించాల్సిన బాకీలు సుమారు రూ.13 వేల కోట్ల ఉన్నాయని, ఈ క్రమంలో సిబ్బంది జీతాల కోసం దాదాపు 850 కోట్ల సేకరణ అసాధ్యమని ఆ శాఖ అధికారులు అంటున్నారు. తమకువచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం చాలా ఉందని ప్రభుత్వం ఆదుకోకుంటే ఇంకా దీనిని నడపడం కష్టమేనంటున్నారు.

సదరు సంస్థ బడ్జెట్‌, బ్యాంకింగ్‌ డివిజన్‌ సీనియర్‌ మేనేజర్‌ పూరన్‌చంద్ర. ఉన్న సమస్యలన్నీ ఏకరవు పెడుతూ టెలికం శాఖకు లేఖను కూడా పంపినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకోబోయే సంస్కరణ చర్యలపైనే బీఎస్‌ఎన్‌ఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ రూ. 90 వేల కోట్ల నిర్వహణా నష్టంతో కొనసాగుతుంది. నిర్వహణా లోపం, ఉద్యోగులకు ఇచ్చే అధిక వేతనాలు, అనవసర విషయాలలో ప్రభుత్వ అధికారుల జోక్యం, టెలికాం రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రణాళికలు లేకపోవటంతో నష్టాల్లో కూరుకుపోయింది.

Related posts