telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వైరల్ వీడియో : పాముతో ఈ మహిళా సాహసం చూడండి

Brooksville Woman frees Snake with head stuck in beer can

సాధారణంగా పాము కన్పిస్తే మనం ఏం చేస్తాము ? కొంతమంది భయపడతారు… ఇంకొంతమంది దానిని చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఓ మహిళ మాత్రం బాధతో కొట్టుమిట్టాడుతున్న పామును కాపాడి సోషల్ మీడియాలో స్టార్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే… ఫ్లోరిడాకు చెందిన రోసా ఫాండ్ అనే మహిళ బ్రూక్స్‌విల్లే మార్గంలో ప్రయాణిస్తున్నారు. అలా వెళ్తూ ఉండగా బీర్‌ క్యాన్ లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పామును రోసా చూశారు. ముందుగా ఆ పామును చూసి భయపడిన ఆమె ఆ తరువాత టిన్‌ మూతను తీసి, దానిని కాపాడారు. ఈ తంతంగాన్ని అంతటినీ వీడియో తీసిన రోసా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో… పామును రెండుసార్లు నా చేతులతో పట్టుకున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts