telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బ్రోచేవారెవరురా” మా వ్యూ

brochevarevarura

బ్యానర్‌: మన్యం ప్రొడక్షన్స్‌
నటీనటులు: శ్రీవిష్ణు, నివేదా థామస్‌, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామక ష్ణ తదితరులు
దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
సంగీతం: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
నిర్మాత: విజయ్‌ కుమార్‌ మన్యం

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ కమర్షియల్ సినిమాలతో ముందుకు వెళుతుంటే… యంగ్ హీరో శ్రీవిష్ణు మాత్రం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. శ్రీవిష్ణు ఇంతకుముందు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో “మెంట‌ల్ మ‌దిలో” సినిమాలో నటించారు. ఇప్పుడు అదే ద‌ర్శ‌కుడితో మ‌రోసారి “బ్రోచేవారెవ‌రురా” అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో శ్రీవిష్ణు ప్రేక్షకుల నుంచి ఎన్ని మార్కులు కొట్టేశాడో చూద్దాము.

కథ :
రాహుల్ (శ్రీవిష్ణు), రాకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ) ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. ఈ ముగ్గురు మిత్రులనూ కలిపి ఆర్ 3బ్యాచ్ అని పిలుస్తుంటారు. ఈ ఆర్3 బ్యాచ్ ఐదేళ్లుగా ఇంటర్ చదువుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే కాలేజ్ ప్రిన్సిపాల్ కూతురు మిత్ర (నివేదా థామస్). అదే కాలేజ్ లో జాయిన్ అవుతుంది. ఆమె ఈ ఆర్3 బ్యాచ్ తో స్నేహం చేస్తుంది. అయితే మిత్రకు చదువంటే ఇష్టం ఉండదు. కానీ భరతనాట్యం అంటే ఇష్టం. తండ్రి క్రమశిక్షణ అంటూ తనను అర్థం చేసుకోకపోవడం కారణంగా ఊరు వదిలి పారిపోవాలని అనుకుంటుంది మిత్ర. దీంతో ఆర్3 బ్యాచ్ తో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడుతుంది. అందువల్ల వారికి 8 లక్షలు రాగా, ఆ డబ్బుతో మిత్ర హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ లో మిత్రను మరో గ్యాంగ్ కిడ్నాప్ చేసి, ఆర్3 బ్యాచ్ ను 10 లక్షలు తెమ్మని అడుగుతారు. అప్పుడు 10 లక్షల కోసం ఆర్3 బ్యాచ్ ఏం చేస్తుంది ? అసలు ఆర్3 బ్యాచ్ ఆ డబ్బును తీసుకొస్తారా ? మిత్రను విడిపించగలిగారా ? మిత్రను కిడ్నాప్ చేసింది ఎవరు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఆర్ 3 బ్యాచ్‌గా శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ బ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీతో ఆకట్టుకుంటారు. మిత్ర పాత్ర‌లో నివేథా థామ‌స్ కూడా మెప్పిస్తుంది. ఇక స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్, శివాజీ రాజా, ఝాన్సీ, అజ‌య్ ఘోష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు. రొటీన్ కథే కానీ… అమ్మాయిలు స‌మాజంలో ఎదుర్కొనే స‌మ‌స్య‌ను మ‌రో కోణంలో చూపించాడు. ట్విస్టుల‌తో సినిమాను ఆస‌క్తిక‌రంగా నడపడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇట‌ర్వెల్‌ సన్నివేశం బాగుంది. వివేక్ సాగ‌ర్ సంగీతం, నేప‌థ్య సంగీతం బావున్నాయి. సాయిశ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ, నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts