telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

భారత్ కి అప్పగించొద్దు.. మాల్యా పిటిషన్.. తీర్పు ఎటు ..

vijaymalya to india will become a dream

ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు తీసుకువచ్చే విషయం తిరిగి యూకే కోర్టుకు చేరింది. మాల్యాను ఇండియాకు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు తీర్పివ్వగా, యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ సైతం అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. ఇక తన అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ మాల్యా మరోమారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం 63 సంవత్సరాల వయసున్న మాల్యా, ఇప్పటికే ఓ మారు యూకే హైకోర్టులో విఫలమైన సంగతి తెలిసిందే.

నేడు మాల్యా పిటిషన్ విచారణకు రానుండగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, మాల్యాను అప్పగించడమా? లేక లండన్ లోనే విచారించడమా? అన్న విషయమై వాదనలు విని, తీర్పివ్వనుంది. ఒకవేళ మాల్యాను ఇండియాకు పంపాలన్న నిర్ణయమే వస్తే, 28 రోజుల్లోగా ఇండియాకు చచ్చినట్టు రావాల్సిందే!

Related posts