telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

కోడింగ్‌పై శిక్షణ కోసం.. హైదరాబాద్‌లో ప్రత్యేక ల్యాబ్‌ ..

bridge lab for training on coding

బ్రిడ్జ్‌ల్యాబ్జ్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 150 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ ల్యాబ్ ద్వారా ప్రతియేటా 1,500 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కంపెనీ ఫౌండర్ మనోజ్ బరోట్ తెలిపారు. ప్రతియేటా 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువు పూర్తిచేసుకొని బయటకు వస్తే వీరిలో 4 వేల మందికి మాత్రమే నైపుణ్యం ఉంటున్నదని, ఈ లోటును పూడ్చడానికి ఈ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

నాలుగు నెలలపాటు ఇవ్వనున్న ఈ శిక్షణకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని, కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం వారు భరించనున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో ఉన్న ల్యాబ్‌ల ద్వారా 800 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధి కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన మూడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Related posts