telugu navyamedia
వార్తలు సామాజిక

వధువు చీర బాగలేదని..పెళ్లికొడుకు ఏంచేశాడో తెలుసా!

sarees marriage

వధువు చీర బాగలేదని పెళ్లికి ఒక రోజు ముందు గొడవ పడి పెళ్లి కుమారుడు పరారీ అయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక హసన్‌ తాలుకా పరిధిలోని బీదర్‌కేర్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బీదర్‌కేర్‌కు చెందిన బీఎన్‌ రఘుకుమార్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గతేడాది కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ మనసులు కలవడంతో.. పెళ్లి ప్రస్తావన గురించి పెద్దలకు చెప్పారు.

మొత్తానికి వీరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించారు. ఈ నెల 6వ తేదీన వారి వివాహం జరగాల్సి ఉండే. అయితే వధువు ధరించిన చీర.. బాగోలేదని వరుడితో పాటు అతని తల్లిదండ్రులు తెలిపారు. చీర మార్చుకోవాలని వధువుకు చెప్పినప్పటికీ ఆమె వినలేదు. దీంతో ఆ పెళ్లిని వరుడు తల్లిదండ్రులు ఆపేశారు. అనంతరం వరుడు ఎవరికీ తెలియకుండా పారిపోయారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts