క్రైమ్ వార్తలు వార్తలు

తెల్లారితే పెళ్లి అనగా… వధువు మాయం

bride missing in banjara hills

మరికాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చిటుచేసుకుంది. ఫిలింనగర్ సమీపంలోని హాకింపెట్ కు చెందిన సంతోషి (19) వివాహం సికింద్రాబాద్ కు చెందిన జైపాల్ తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మారత్ బజార్ లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధువారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్ళికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషీ మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related posts

పడక సుఖం దొరకకే శ్రీరెడ్డి ఉద్యమం.. సంచలనంగా యాంకర్ రష్మీ…

nagaraj chanti

రెచ్చిపోయిన స్మగ్లర్లు… అధికారులపై దాడులు

nagaraj chanti

ప్రియుడితో వీడియోలు…పడకసుఖానికి అడ్డొస్తున్నారని కన్న బిడ్డలను చంపిన తల్లి

nagaraj chanti

Leave a Comment