telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెల్లి పెళ్ళిలో అన్న లవ్ ప్రపోజల్… వీడియో వైరల్

Propose

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సియారా మెక్‌గింటీ అనే యువతి తన పెళ్లి రోజున చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కూతురు డ్రెస్‌లో చేతిలో పూలు పట్టుకుని సియారా ఫంక్షన్ హాల్‌కు వచ్చింది. తన చేతిలోని పూలను అక్కడున్న యువతులందరికీ ఇస్తుందనుకుంటే సియారా షాకిచ్చింది. ఆ పూలు మొత్తం తీసుకెళ్లి బేలీ గిల్‌మోర్ అనే యువతికి ఇచ్చింది. ఇదే సమయంలో బేలీ వెనుక మోకళ్లపై కూర్చొని ఉన్న సియారా అన్న సోలొమాన్ మెక్‌గిన్టీ తన ప్రేయసి బేలీకి ప్రపోజ్ చేశాడు. ఒక పక్క చెల్లి.. మరోపక్క అన్న ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు అక్కడున్న వారితో పాటు బేలీ కూడా షాకైంది. అయితే సోలొమాన్ లవ్ ప్రపోజల్‌కు బేలీ గిల్‌మోర్ ఓకే చెప్పేయడంతో.. ఒకేరోజు రెండు పండుగలు వచ్చినట్టు అయింది. తన ప్లాన్ గురించి సియారా మాట్లాడుతూ.. తన పెళ్లిరోజున అన్న ప్రేమకు సాయం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. తన పెళ్లిలో మాత్రమే అన్న లవ్ ప్రపోజల్‌ను కళ్లారా చూసే అవకాశం ఉంటుందని తాను ఇలా ప్లాన్ చేసినట్టు పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts