telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్లికూతురుతో పోటీపడి డ్యాన్స్ చేసిన శునకం

Sara

అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్ ఇటీవల తన తోటి ట్రైనర్ జాన్ డివైన్‌ను వివాహం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆమె తన వివాహ వేడుకలో ఏడేళ్ల పెంపుడు శునకంతో పాటు డ్యాన్స్ చేసింది. ఆ శునకం చేసిన డ్యాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. పెళ్లికూతురితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసింది ఆ శునకం. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో సారా, ఆమె శునకం ఫ్రీస్టయిల్ డాన్స్‌చేస్తూ కనిపించారు. వివాహ వేడుకకు వచ్చిన వారు వీరి డ్యాన్స్‌ను చూసి ఆశ్చర్యపోయారు. సారా ఏవిధంగా నృత్యం చేస్తున్నదో దానిని శునకం కూడా అనుసరించడం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటివరకూ 90 లక్షల మందికిపైగా వీక్షించారు.

Related posts