telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రక్తదానం.. ఎవరు చేయాలో తెలుసా

 రక్తదానం అంటే ప్రాణదానం 

రక్తం మన శరీరంలో ప్రతి అవయవానికి అవసరం

రక్త ప్రసరణే లేకపోతే ప్రాణం లేనట్టే లెక్క   

ప్రాణాపాయంలో వున్న ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడానికి

రక్తమిస్తే అది దానం అవుతుంది

ధనాన్ని ఆశిస్తే అది వ్యాపారం అవుతుంది 

 

నైతిక విలువలను తెలిసిన ఎవరైనా

కంటి పొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు

దానం చేసేందుకే ఇష్టపడతారు.. అమ్ముకోడానికి యత్నించరు

ప్రాణాపాయంలో వున్న ఒక మనిషికి ప్రాణం పోయడం

నీ శరీరంలో వున్న ఒక భాగాన్ని ఇవ్వాలన్న ఆలోచన రావడం

నీలోని గొప్ప గుణాలకు ప్రతీక ….

 

మనం ఎవరికైనా ఏమైనా దానం చేస్తే

కుడి చేతికి తప్ప ఎడమ చేతికి తెలియకూడదు అంటారు

కానీ, ప్రస్తుతం చేసేది అణువంత అయినా 

ప్రపంచం అందుకోలేనంత పబ్లిసిటీ 

తప్పు లేదు పబ్లిసిటీ లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది

సోషల్ మీడియా వున్నది అందుకే కదా…!

 

నువ్విచ్చే పబ్లిసిటీ నిన్ను చూసి 

నలుగురిలో మార్పు తెప్పించేదిగా ఉండాలి

అప్పుడు పదిమందిలో నువ్వు గొప్ప విజేతవవుతావు

నీ విజయం నిన్ను చూసేవారికి మార్గదర్శకం కావాలి

నీ అనుసరణలో ఒక్క అడుగైనా వేయాలనిపించాలి 

అది నీ పబ్లిసిటీకి విలువనిస్తుంది 

 

రక్తం ఇవ్వడం వల్ల శక్తిని కోల్పోయే ప్రమాదం ఎవరికీ ఉండదు

గ్రహించి ఆపదలో వున్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయండి

చేస్తే నాకేం వస్తుంది..? ఉపయోగం ఏంటి…?

అని వ్యర్థమైన ఆలోచనలను వీడండి

మానవత్వమే మనిషికి ముద్దు 

అసత్యప్రచారాలు నమ్మొద్దు 

 

తల్లి గర్బంలోనుండి బయటికి వచ్చేటప్పుడు

రక్తపు మడుగులోనుండే బయటికి వస్తావు

ఆ క్షణం నాకెందుకు ఈ నరకం అనుకుంటే 

నీవు నేను లేము…. ఏమంటారు …?

మనం చేసే రక్తదానం వల్ల ఒక ప్రాణం నిలబడుతుందంటే 

అంతకన్నా మించిన ఆనందం మరెక్కడుంటుంది

 

 

Related posts