telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

శ్వాసతీసుకోవడం .. హానికరమా.. ఇదేమి ట్యాగ్ లైన్ రా బాబు.. ఢిల్లీలో తప్పట్లేదట మరి..

breathing is injurious to health

ఇప్పటివరకు చాలా చోట్ల పొగత్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్‌లైన్లు ఉండటం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వీటితోపాటు మరో కొత్త పదం తెరపైకి వచ్చింది. ఆ కొత్త పదమేంటనుకుంటున్నారా..? శ్వాస తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం (బ్రీతింగ్ ఈజ్ ఇన్‌జూరియస్ టు హెల్త్)అంటూ ఇపుడు సరికొత్త పదం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ హఠాత్తుగా ఈ కొత్త ట్యాగ్‌లైన్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా.? దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

వాయునాణ్యత ప్రమాణాలు అట్టడుగుస్థాయికి పడిపోవడంతో ఇపుడు ఢిల్లీ వాసులు ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.. ఇండియా గేట్ చిత్రంపై బ్రీతింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్ అని రాసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతోపాటు సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఇడ్లి సాంబార్ మాదిరి ఆక్సిజన్ కూడా అమ్మకాలు జరుగుతున్నాయట. బయటకి రావాలంటే అది కొనుక్కోవాలి, లేదంటే అంతేనట!

Related posts