telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో .. బ్రేక్ అప్ చెప్పడం తప్పేమీలేదు.. : హైకోర్టు

high court on new building in telangana

ఈ మధ్యకాలంలో యువత ప్రేమ పేరుతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడి అర్ధారంతరంగా విడిపోతుండటం చూస్తూనే ఉన్నాం. పెళ్ళికి ముందే సెక్స్.. ఇటీవల యువతకు ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ హైకోర్టు ఓ రేప్ కేసులో సంచలన తీర్పును వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేమించిన అమ్మాయితో శారీరిక సంబంధం ఏర్పరుచుకున్నా.. ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పడం పెద్ద తప్పేమి కాదంటూ ఢిల్లీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వినడానికి ఇది ఎబ్బెట్టుగా ఉన్నా.. న్యాయస్థానం దాన్ని పెద్ద నేరం కాదంటూ తీర్పు వెల్లడించింది. 2016లో ఓ మహిళ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడంటూ.. ఓ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అఘాయిత్యం చేశాడని చెప్పింది. చివరికి పెళ్లి అనేసరికి మొహం చాటేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

ఆ మహిళ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురును ఆ వ్యక్తితో వివాహం చేయడానికి ఇష్టం లేదని ట్రయల్ కోర్టు ముందు ఒప్పుకోవడం.. ఇష్టపూర్వకంగానే ఆ మహిళ అతడితో సంబంధం ఏర్పర్చుకున్నానని చెప్పడంతో కోర్టు సదరు వ్యక్తిపై కేసును కొట్టేసింది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం… ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం శిక్షించదగినదేమీ కాదు.. ఇద్దరూ కూడా తమ ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం ఏర్పరుచుకోవడం నేరమేమీ కాదంటూ కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ తీర్పు పట్ల సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts