వార్తలు సినిమా వార్తలు హాస్యం

స్టాండప్ కామెడీ అంటే… కూర్చొని కూడా నవ్వొచ్చట…!?

bramhanandam

వెండితెరపై తనదైన శైలిలో నటించి ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. ఇప్పటివరకు 1000 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కూడా. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను నవ్వించబోతున్నారట బ్రహ్మానందం. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న కామెడీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారట.

తమ కామెడీ షోకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. ప్రోమోను చూసిన బ్రహ్మానందం అభిమానులు ఇప్పట్నించీ బ్రహ్మానందం కామెడిని ఇంట్లోనే కూర్చొని చూడవచ్చు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోమోలో “స్టాండప్ కామెడీ అంటే… కూర్చొని కూడా నవ్వొచ్చు…” అంటూ బుల్లి తెరపై ఆయన చేసిన సందడి అందరిని ఆకట్టుకుంటోంది. అయితే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Related posts

ఏఆర్ రెహమాన్ కు జన్మదిన శుభాకాంక్షలు

admin

రెజినా 'మిస్టర్ చంద్రమౌళి' చిత్రం …

admin

పార్టీ మారను.. నోటీసుపై వివరణ ఇస్తా: రాజగోపాల్‌ రెడ్డి

madhu

Leave a Comment