telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఒకపక్క వర్షాలు లేక ఎదురుచూపు.. మరోపక్క భారీ వర్షాలకు ప్రమాదస్థాయిలో నదీప్రవాహాలు..

brahmaputra river in dangerous flow

తాజాగా కురిసిన భారీ వర్షాల తో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. అసోంలోని జోర్హట్ వద్ద నీటి మట్టం డేంజర్ మార్క్ ను దాటింది. ఈ నేపథ్యంలో 62వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేమాజీ, లక్ష్మిపూర్, బిశ్వనాథ్, జోర్హట్, గోలాఘాట్ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా గౌహతిలో కొండచరియలు విరగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

గత ఏడాది రాష్ట్రంలో వరదల కారణంగా దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో… పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

Related posts