telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బ్రహ్మి ఈజ్ బ్యాక్!’ .. రా ఏజెంట్ గా.. బ్రహ్మానందం..

brahmanandam with brahmmi is back movie

బ్రహ్మానందం ఈ మద్య శ్వాసకోస ఇబ్బందితో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. దానితో వెండి తెరపై బ్రహ్మిని చూడలేమా అన్న అనుమానాలు..బాధ కలిగాయి ప్రేక్షకులకు..కానీ బైపాస్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం రెస్ట్ తీసుకుని మళ్లీ బిజీ అవుతున్నారు. ‘బ్రహ్మి ఈజ్ బ్యాక్!’ అనే టైటిల్ తో రూపొందబోయే చిత్రంలో బ్రహ్మానందం ప్రదాన పాత్రలో కనిపించబోతన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత శ్రీధర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం రా ఏజెంట్ గా కనిపించబోతున్నారట.

బ్రహ్మానందం చేసే చేష్టలు ఫుల్ ఫన్ తో నిండి ఉంటాయంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా పూర్తి కామెడీతో, పంచ్ డైలాగులతో , బ్రహ్మీ చేసే అల్లరి పనులతో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ మెంట్ చేయబోతున్నారట.

ప్రముఖ హాస్య దర్శకుడు జంద్యాల దర్శకత్వంలో ‘అహనా పెళ్లంట’చిత్రంతో అరగుండు బ్రంహానందంగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ తర్వాత స్టార్ కమీడియన్ గా ఎదిగిపోయారు. ఒకదశలో బ్రహ్మానందం లేని చిత్రం లేదు అనే స్థాయికి ఎదిగారు. కేవలం తన ముఖ కవలికలతో నే కడుపుబ్బా నవ్వించగల దిట్ట బ్రహ్మానందం. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ ఆప్ వరల్డ్ రికార్డు లో తన పేరు నమోదు చేసుకున్నారు.

Related posts