telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మాంచెస్టర్‌ : … మళ్ళీ బ్రాడ్ కి .. దొరికిపోయిన వార్నర్..

brad took again warner wicket

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ అద్వితీయ ఫామ్‌ కొనసాగిస్తూ టెస్టుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కానీ వార్నర్‌ మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. వరుసగా మూడు సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన మూడో ఆసీస్ ఓపెనర్‌గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు విక్టోర్‌ ట్రంపర్‌, గ్రేమ్‌ వుడ్‌ పేరిట ఉంది. 1908లో విక్టోర్‌, 1980లో గ్రేమ్‌ వుడ్‌ ఇలా పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగారు.

యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌కు ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ కొరకరాని కొయ్యాలా మారాడు. బ్రాడ్‌కు వార్నర్‌ వికెట్‌ సమర్పించుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరు సార్లు బ్రాడ్‌ చేతిలోనే ఔటై పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌లో స్మిత్‌ 671 పరుగులతో చెలరేగుతుండగా వార్నర్‌ 79 పరుగులు మాత్రమే చేశాడు. దీనిలో మూడు డకౌట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 78 టెస్టులు ఆడిన వార్నర్‌ 46 సగటుతో 6442 పరుగులు చేశాడు.

Related posts