telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

అబ్బాయిలు 18 ఏళ్లకే .. పెళ్లి చేసుకోవచ్చట.. కేంద్రం కొత్త నిర్ణయం..

గతంలో బాల్యవివాహాలను నివారించే నేపథ్యంలో ప్రభుత్వం అమ్మాయిలు 18 ఏళ్లకు అబ్బాయిలు 21 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే వారు అమ్మాయిలైతే 18 ఏళ్లు నిండే వరకు అబ్బాయిలతో 21 ఏళ్ల నిండే వరకు వెయిట్ చేయాల్సిందే లేకపోతే చట్టపరంగా ఆ వివాహాన్ని బాల్య వివాహం గా పరిగణిస్తూ వారిపై చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం పురుషులు వివాహ వయస్సు 21 ఏళ్లు ఉండగా అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం పురుషుల వివాహ వయస్సు 21 ఏళ్ల నుంచి మూడేళ్ల తగ్గించి అమ్మాయిల తో సమానంగా చేసేందుకు కేంద్రం యోచిస్తోందట. బాల్య వివాహ నిషేధ చట్టంలో సవరణలపై తాజాగా నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో… పురుషుల వయస్సు కుదింపు అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు కూడా ప్రారంభమైనట్లు ఢిల్లీ హైకోర్టు విన్నవించినట్టు కేంద్రం తెలియచేసింది.

ఈ నేపథ్యంలో అబ్బాయిలు కూడా 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు అని నిబంధన పెట్టనుంది కేంద్రం. వివాహ విషయంలో ప్రస్తుత చట్టం ప్రకారం అమ్మాయిల కంటే 3 ఏళ్ళు అబ్బాయిలకి ఎక్కువగా వయస్సు ఉండే నిబంధన ఉంది, కానీ ప్రస్తుత బాల్య వివాహ నిషేధ చట్టం సవరణలో భాగంగా అమ్మాయిలకు అబ్బాయిలకు ఓకే వయసు ఉండాలంటూ ఈ ఏడాది ఆగస్ట్ లో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది.. బాల్య వివాహ నిషేధ చట్టాన్ని కి సవరణ కోసం మహిళా శిశు సంక్షేమ విశాఖ తో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా బాల్య వివాహ నిషేధ చట్టం సవరణ లో మార్పులు చేసే నిర్ణయం తీసుకునే ముందు… పలు చట్టాలను మార్చాల్సి ఉంటుందని … ఈ నేపథ్యంలో న్యాయ శాఖను కూడా కక్షిదారుగా చేర్చాలని కోర్టును కోరారు న్యాయవాది . కాగా న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 19 కి వాయిదా వేసింది.

Related posts