telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

చైనా ను నిషేధించండి.. #బాయ్ కాట్ చైనా .. !!

boycott china with hash tag viral

నేడు జరిగిన ఐక్యరాజ్యసమితి రక్షణ మండలి సమావేశంలో కూడా చైనా తన బుద్ది చూపించిన విషయం తెలిసిందే. దీనితో భారత్ మొత్తం ఆవేశంతో ఊగిపోతున్నారు. చైనా వస్తువులను నిషేదించాలని హ్యాష్ ట్యాగ్ ద్వారా నెట్ ఇంట్లో ప్రచారం కూడా భారీగానే చేస్తున్నారు. చైనా యాప్ టిక్ టాక్ కూడా భారతీయులు తీసేయాలని ప్రచారం చేస్తున్నారు.

మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా మరోసారి అడ్డుకోవడంపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచీ చైనా ఉత్పత్తులను నిషేధించండి (#BoycottChineseProducts) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం టాప్ ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా ఉండటం విశేషం. అమెరికా, యూకే, ఫ్రాన్స్ .. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తీసుకురాగా.. చైనా మరోసారి దానిని అడ్డుకుంది.

చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. దీనిపై అమెరికా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర మార్గాల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అప్పటి నుంచీ ట్విటర్‌లో చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. భారత్.. చైనాకు ఎంత ఎగుమతి చేస్తోంది.. ఎంత దిగుమతి చేసుకుంటోంది… వాణిజ్య లోటు ఎంత ఉంది అంటూ ఒకరు లెక్కలు తీయగా.. 1945లో జపాన్‌పై అమెరికా బాంబు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఆ దేశస్థులు అమెరికా వస్తువులను వాడటం లేదని, దేశభక్తి అంటే ఇదీ అని మరొకరు ట్వీట్ చేశారు.

Related posts