telugu navyamedia
సినిమా వార్తలు

మెగా హీరో షూటింగ్ కు బ్రేక్… కుల వివాదం కారణం…

Valmiki images

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మృణాళిని ర‌వి మరో హీరోయిన్ గా నటిస్తోంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించిన సమయంలో… టైటిల్ మార్చాలంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరపడానికి దర్శకుడు హరీష్ శంకర్ తన చిత్రబృందంతో కలిసి అనంతపూర్ వెళ్లారు. అక్కడ బోయ కులానికి చెందిన కొందరు వ్యక్తులు షూటింగ్ దగ్గరకి వచ్చి నానా గొడవ చేసినట్లు సమాచారం. తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరక్కుండా అడ్డుకున్నారట. సినిమాలో ఎక్కడా వాల్మీకిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండవని ఎంతగా చెప్పినా వారు వినకపోవడంతో చేసేదేమీ లేక షూటింగ్ క్యాన్సిల్ చేశారట. తను అనుకున్నట్లుగా అక్కడ షూటింగ్ జరిపే ఛాన్స్ లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చేసినట్లు తెలుస్తోంది. అదే షెడ్యూల్ ని చేవెల్ల ప్రాంత పరిధుల్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts