telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇంట్లో ఎవరూ లేనప్పుడు… ఈ బాలుడు చేసిన పని తెలిస్తే షాకే…!?

Boy

ఇంగ్లాండ్‌లో లూక్ బన్స్ (13) అనే బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి పాల్పడ్డాడు. లూక్ తల్లి, తండ్రి ఇంట్లో లేని సమయంలో ఫోన్‌లో ఉరి వేసుకున్న యానిమేషన్ ఫొటోలు (హ్యాంగింగ్ ఆనిమేషన్స్) అని సెర్చ్ చేశాడు. వివిధ కార్టూన్ క్యారెక్టర్లు ఉరి వేసుకుని ఉన్న ఫొటోలు రావడంతో.. తాను కూడా ఉరి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి రాగా.. గదిలో ఉరి వేసుకుని కనిపించిన కొడుకును చూసి విలవిలలాడిపోయింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే లూక్ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. లూక్ ఫోన్ తీసి చూడగా.. ఉరి వేసుకుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ యానిమేషన్స్ కనిపించినట్టు లూక్ తల్లి వివరించింది. లూక్ ఎప్పుడూ అల్లరి పనులు చేస్తాడని తమకు తెలుసని.. ఈ కారణంగా లూక్‌ను ఎప్పుడూ ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్లలేదని తల్లి చెప్పింది. పోలీసులు దీనిపై దర్యాప్తు జరపగా.. లూక్‌ ఉరి వేసుకున్న సమయంలో ఊపిరాడకే చనిపోయినట్టు తేలింది. టెక్నాలజీ యుగంలో పిల్లలు ఏం చేస్తున్నారన్నదానిపై తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related posts