telugu navyamedia
culture news trending

బాలుడికి గత జన్మ స్మృతులు.. తానే డయానా ను.. అంటున్న వైనం..

boy got past life memories viral

సైన్స్ కి అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ విశ్వములో.. అందుకే నమ్మకం-అపనమ్మకం అనేవి రెండుగా తెలుస్తున్నాయి. ఇటువంటి వాటిని కొన్నిఘటనలు బలపరుస్తుంటాయి. తాజాగా, ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ అనే నాలుగేళ్ల బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానానంటూ సంచలనం సృష్టిస్తున్నాడు. బిల్లీ తండ్రి పేరు డేవిడ్ క్యాంప్ బెల్. డేవిడ్ ఆస్ట్రేలియాలో ప్రముఖ టీవీ ప్రజెంటర్ గా గుర్తింపు పొందాడు. ఒకరోజు డయానా ఫొటో చూసిన అతని కుమారుడు బిల్లీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలా చూడు! అప్పట్లో నేను యువరాణిగా ఉన్నప్పటి ఫొటో ఇది అంటూ చెప్పడంతో డేవిడ్ ఆశ్చర్యపోయాడు.

ప్రిన్సెస్ డయానా, తన ప్రియుడితో కలిసి మీడియా ప్రతినిధుల బారినుంచి తప్పించుకునే క్రమంలో 1997లో ఓ కారు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత 18 ఏళ్లకు పుట్టిన తన కుమారుడు బిల్లీ ఇప్పుడు తానే ప్రిన్సెస్ డయానా అంటుండడం పట్ల ఏంచేయాలో అర్థంకాక డేవిడ్ క్యాంప్ బెల్ తల పట్టుకుంటున్నాడు. ఫొటోతో సరిపెట్టకుండా, ప్రిన్సెస్ డయానా బాల్యంలోని విషయాలను కూడా పూసగుచ్చినట్టు చెప్పడం, విలియం, హ్యారీలను తన కొడుకులు అని పేర్కొనడంతో డేవిడ్ కు మతిపోయినంత పనైంది. షాక్ కలిగించే అంశం ఏంటంటే, డయానా సోదరుడు జాన్ పుట్టిన కొన్ని గంటల్లోనే పురిట్లోనే చనిపోయాడు. ఇప్పుడా జాన్ గురించి కూడా బిల్లీ చెబుతుండడం మరింత విస్తుగొలుపుతోంది.

Related posts

దేశ పౌరుల్లో భయం నెలకొంది: కేజ్రీవాల్

vimala p

కోహ్లీ నిన్ను తల్లిని మాత్రమే చేశాడు… అనుష్క శర్మపై మహిళా జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్

vimala p

జాతరకు ముందే మేడారంకు భక్తుల తాకిడి

vimala p