telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సాంకేతిక

ఆరోగ్యమైన చేపల కోసం… నౌకను రూపొందించిన బాలుడు…

boy developed ship for healthy fishes

ఒక చిన్న బాలుడు వాతావరణ సమతుల్యతను గురించి ఆలోచించాడు, దానికి పరిష్కారం కూడా కనుక్కున్నాడు. ఇటివంటి విషయాలు పెద్దలు కూడా ఆలోచించడంలేదు. మరి అంతటి బుడతడు చేసింది గొప్పపనేకదా. వివరాలలోకి వెళితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్‌ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్‌ ఖాజీ అందరి మన్ననలూ అందుకున్నాడు. తాను పలు డాక్యుమెంటరీలు చూసి సముద్ర జీవజాలంపై వ్యర్ధాల ప్రభావాన్ని అర్ధం చేసుకున్నానని, దీని కోసం ఏదైనా తలపెట్టాలని నిర్ణయించుకున్నానని ఖాజీ చెబుతాడు.

ఆహారంలో మనం తీసుకునే చేప సముద్రంలోని ప్లాస్టిక్‌ను తింటుండటంతో మానవులపైనా ఈ ప్రభావం పడుతుందని, అందుకే తాను ఎర్విస్‌ను డిజైన్‌ చేశానని చెప్పుకొచ్చాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్ధాలను వేరు చేసి శుద్ధ జలాలు, జీవజాలాన్ని సముద్రంలోకి తిరిగి పంపుతుంది, వ్యర్ధాలను ఐదు భాగాలుగా విడగొడుతుంది. టెడ్‌ఎక్స్‌, టెడ్‌ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక డిజైన్‌ను ఖాజీ ప్రపంచం ముందుంచగా పలువురు అంతర్జాతీయ మేథావులు, సంస్ధలు అతడి ప్రతిభకు అబ్బురపడ్డాయి. ఇక ఎర్విస్‌ నౌక కింది భాగంలో ఉండే మెషీన్‌ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది.

సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్ధాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల జరిగే అనర్దాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నారు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పూనుకున్న పన్నెండేళ్ల బాలుడు హజీక్‌ ఖాజీకి అందరూ హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

Related posts