telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటుడిగా మారుతున్న నిర్మాత… “బాక్సర్”లో కీలకపాత్ర

Boxer

నయనతార నటించిన ‘కొలైయుదిర్‌కాలమ్‌’, హన్సిక నటిస్తున్న ‘మహా’ చిత్రాల నిర్మాత వి. మదిఅళగన్. ఇప్పుడు ఈ నిర్మాత యువ నటుడు అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న ‘బాక్సర్‌’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించనున్నారు. ఈ విషయమై మది అళగన్‌ మాట్లాడుతూ ‘బాక్సర్‌’ చిత్రంలో హీరో అరుణ్‌ విజయ్‌ బరువు పెంచి, బరువు తగ్గించి మూడు రకాలుగా నటిస్తున్నారని తెలిపారు. షూటింగ్‌ సమయంలో హాస్యనటుడు వివేక్‌ ఆ చిత్రంలో ఓ పాత్ర పోషించమని పట్టుబట్టారని తెలిపారు. తొలుత నటించేందుకు భయపడ్డానని, ఆ తర్వాత మేకప్‌ వేసుకొని కొన్ని షాట్లలో నటించి చూసినప్పుడు అందరూ మెచ్చుకున్నారని, చివరకు ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నానని మది అళగన్‌ తెలిపారు.

Related posts