telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ మీర్ పేటలో డబ్బా పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు

New couples attack SR Nagar

చెత్త కుప్పలో దొరికిన డబ్బా పేలడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ మీర్ పేటలో ఉన్న విజయపురి కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చెత్త ఏరుకుంటున్న ఓ మహిళకు చెత్త కుప్పలో ఓ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఆమె తెరిచే ప్రయత్నం చేసింది. డబ్బాను తెరిచేందుకు నేలకేసి కొట్టింది. దీంతో, భారీ శబ్దంతో డబ్బా పేలిపోయింది.

ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో షాక్ తిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Related posts