telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స

మాజీ సీఎం చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేయడం అధికార విధుల్లో భాగమే అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బొత్స మాట్లాడుతూ దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నారని, వారిని కూడా తనిఖీలు చేస్తున్నారని బొత్స తెలిపారు. అయితే చంద్రబాబు తనిఖీపైనే నానా హంగామా చేయడం అంత అవసరం లేదన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్యూరిటీని తొలగించారని అదేమని అడిగితే మీకంతా రక్షణ అవసరం లేదని అన్నారని మంత్రి గుర్తు చేశారు.

రాష్ట్ర రాజధాని అమరావతిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. రాజధానిపై అపోహలు అనవసరమని ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం నాది అని పేదలు భావించే రీతిలో పాలన ఉండబోతోందన్నారు. పేదలకు పక్కా గృహ నిర్మాణాలు, ఇళ్ల స్థలాలను మంజూరు చేస‍్తామని, పట్టణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు.

Related posts