telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజధానికి … కట్టుబడి ఉన్నాం.. : బొత్స

minister bosta in vijayawada meeting

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. రాజధాని అంశంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజధాని ఏ ఒక్కరిదో.. ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదని బొత్స స్పష్టం చేశారు. రాజధాని అంశం ఐదు కోట్ల మంది ఆంధ్రులదని వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతానికి వరద ముంపు ఉందని బొత్స తెలిపారు.

గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 8 లక్షల క్యూసెక్కుల వరద నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని బొత్స గుర్తుచేశారు. అలాంటప్పుడు 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా బొత్స మండిపడ్డారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేత కోడెల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స చెప్పారు.

Related posts