telugu navyamedia
సినిమా వార్తలు

దక్షిణాది సినిమాలపై జాన్వీ అభిప్రాయం… క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్

Jahnavi-Kapoor

అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందని ఎంతో కాలంగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీనే హీరోయిన్‌ అంటూ సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మరికొందరు మాత్రం జాన్వీకి సౌత్ ఇండియా సినిమాల్లో నటించడం ఇష్టం లేదంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ “జాన్వీకి కానీ.. తమ కుటుంబానికి కానీ.. దక్షిణ భారత సినిమాలంటే ఎంతో ప్రేమ అని ఆయన తెలిపారు. ‘‘సౌతిండియా సినిమాలంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. శ్రీదేవి ఎన్నో సినిమాలు సౌతిండియాలో చేసింది. చిరంజీవి, కృష్ట వంటి వారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. మహేశ్ బాబు, మేము పరస్పరం ఎంతో గౌరవించుకుంటాము. మంచి కథ దొరికితే సౌతిండియాలో సినిమా చేసేందుకు జాన్వీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాము. పెద్ద స్టార్ సినిమాల్లో వస్తున్న అవకాశాలను జాన్వీ తిరస్కరిస్తుంది, సౌతిండియాలో నటించడం తనకు ఇష్టం లేదు అన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి” అని బోనీ కపూర్ స్పష్టం చేశారు.

Related posts