telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంక‌ర్ : “బోనాలు” చార్ట్ బ‌స్ట‌ర్ వీడియో సాంగ్

Ismart-Shankar

పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో రామ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంక‌ర్”. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మించారు. పూరీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సెప్టెంబ‌ర్ 27, 28, 29 తేదీల‌లో చిత్రాన్ని ప‌ది థియేట‌ర్స్‌లో రీ రిలీజ్ చేశారు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా తాజాగా “బోనాలు” అనే చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో రామ్ స్టెప్స్ యూత్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts