telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు క్యాన్సర్… ఆరుగురు హీరోయిన్లతో …

irfan-khan

తెలుగులో వచ్చిన ‘సైనికుడు’ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఇర్ఫాన్ ఖాన్ బ్రెయిన్‌కు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ లండన్‌లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలోనూ నటించారు. ఇందులో కరీనా కపూర్ పోలీసు పాత్రలో నటించారు. సినిమాను ప్రమోట్ చేయలేకపోతుండడంతో బాలీవుడ్‌కు చెందిన ఆరుగురు హీరోయిన్లతో సినిమాను ప్రమోట్ చేయించారు. ఆలియా భట్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, అనన్యా పాండే, జాన్వి కపూర్, కృతి సనన్ కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఈ సినిమాలోని ‘కుడి ను నాచ్నే దే’ అనే పాటకు ఈ స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియోను రూపొందించారు. ఎవరికి వారు తమకు నచ్చినట్లుగా డ్యా్న్స్‌లు చేస్తూ వీడియో చేసారు. ఈ వీడియోను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విటర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. మార్చి 13న సినిమా రిలీజ్ కానుంది. 

.

Related posts