kerala High Court Allows to live with Same Sex Partner

గే సెక్స్ ఫై గాలికి కొట్టుకుపోయిన చట్టం.. హర్షం వ్యక్తం చేస్తున్న అగ్ర నటులు..

స్వలింగ సంపర్కుల (గే సెక్స్) హక్కు లపై దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇకపై స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. సెక్సువాలిటీ నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ తుది తీర్పు వెలువడింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. సెక్షన్ 377 రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది….

కాగా ఈ తీర్పును పలువురు సెలబ్రిటీలు స్వాగతించారు…. ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు అని సెక్షన్ 377 ను దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) కొట్టివేయడం ఆహ్వానిస్తున్నామని ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు… ప్రముఖ నిర్మాత, బాలీవుడ్ నటి స్వరభాస్కర్ కూడా ట్వీట్ చేస్తూ సమున్నత తీర్పును వెలువరించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు నైతికత రాజ్యాంగ హక్కులను నిర్ధేశించలేమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని వ్యాఖ్యానించారు… కాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ స్పందిస్తూ ఈ తరంలో సమ దృష్టిని ప్రదర్శిస్తూ సున్నితమైన నిర్ణయాలు తీసుకునే వారున్నారన్న నమ్మకాన్ని సుప్రీం నిలబెట్టింది… అంటూ సెక్షన్ 377 చట్టం గాలిలో కొట్టుకుపోయిందని తెలిపారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *