telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడాకులు తీసుకున్న ప్రముఖ సింగర్

చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో టైటిల్ పాట పాడిన సునిధి చౌహాన్ తాజాగా తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. ఆమె తన భర్త హితేష్ సోనిక్ నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోవడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు వాళ్ల ఎనిమిదేళ్ల బంధానికి పులిస్టాప్ పెట్టేసారు. మీడియాకు అందిన సమాచారం మేరకు సునిధి, హితేష్ గత కొద్ది రోజులుగా విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. వీరిద్దరు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. కాగా ఇటీవలె సునిధి హితేష్‌ల వారి స్నేహితులు కలిసి గోవాకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు సమాచారం. అవి వీళ్లిద్దరు విడిపోవడానికి బీజం పడింది. దీంతో వీళ్లిద్దరు విడిపోవడానికి నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరు కూడా రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2012లో పెళ్లి చేసుకున్నారు. సునిధి 2018లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Related posts