telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గల్లీబాయ్ నుండి.. ముఖ్యమైన సన్నివేశం కట్ చేసేసిన సెన్సార్ .. నిరుత్సహంలో.. !!

bollywood movie galliboy censored

ఇటీవలే సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది, రణవీర్ సింగ్‌, అలియా భట్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం గల్లీబాయ్. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి పలు కట్స్‌తో U/A సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బోర్డ్‌. ముఖ్యంగా ఓ రొమాంటిక్ సన్నివేశంలో రణవీర్‌, అలియా మధ్య ఉన్న 13 సెకన్ల ముద్దు సన్నివేశం నిడివి తగ్గించమని సీబీఎఫ్‌సీ సూచన చేయడంతో పాటు క్లోజప్ షాట్‌ని వైడ్ యాంగిల్‌లో చూపించమని సలహా ఇచ్చిందట. ఇది మినహా సినిమాకి సంబంధించి ఎలాంటి సమస్య లేదని చిత్ర నిర్మాత రితేష్ సిద్వానీ పేర్కొన్నారు.

గల్లీ బాయ్ చిత్రాన్ని ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించగా ఈ చిత్రానికి ఇండియన్ క్రిటిక్స్, ఇంటర్నేషనల్ ఫిలిం జర్నలిస్ట్స్ నుండి ప్రశంసలు లభించాయి. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Related posts