telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” నుంచి తప్పుకోనున్న అలియా…?

Alia

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 70 శాతం వరకూ షూటింగ్ పూర్తయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీలు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది జులైలో రిలీజ్ కావాల్సి ఉండగా.. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల రాజమౌళి తెలిపారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటి ఒలివియా మెరిస్ నటిస్తుంటే.. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకుంటున్నట్లు తాజాగా ఓ వార్త హల్చల్ అవుతోంది. పూణే షెడ్యూల్‌లో అలియా ఆర్ఆర్ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఏవో కారణాలతో పూణె షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. దీంతో.. అలియా ఆర్ఆర్ఆర్‌కి ఇచ్చిన డేట్స్ అయిపోనున్నాయి. అందులోనూ బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ఇప్పుడు ఆమె చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు గంగూబాయ్, సడక్ 2, బ్రహ్మస్త్ర ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts