telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ దర్శకుడు రూమ్ కు రమ్మన్నాడు : విద్యాబాలన్

Vidyabalan

గత కొంతకాలం క్రితం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి “మీటూ” ఉద్యమం ఉధృతంగా మారిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో కూడా పలువురు ప్రముఖులు సంచలన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా స్టార్ హీరోయిన్లు సైతం తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా కెరీర్ తొలి నాళ్లలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొందట. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా విద్య తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. కెరీర్ తొలి రోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని విద్య తెలిపింది. “సినిమా లైన్ చెప్పడానికి ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. సినిమా పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం కావాలని అడిగాడు. నేను సరే అని చెప్పి.. ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్పా. అందుకు అతను అంగీకరించలేదు. తన రూమ్‌కి రావాలని చెప్పి వెకిలిగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చి తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నావైపు పైకి కిందకి చూసి వెళ్ళిపోయాడు” అని విద్య చెప్పింది.

Related posts