telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా నటించినా మా వారికి నథింగ్… బోల్డ్ బ్యూటీ కామెంట్స్

Survin

హాట్ బ్యూటీ సుర్విన్ చావ్లా చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లైన తరువాత బోల్డ్ పాత్రలు చేస్తుంటే మీ భర్త ఏం అనడా అంటే… “నగ్నంగా నటించినా మా వారికి నథింగ్.. ఆయన నన్ను అంతలా అర్థం చేసుకున్నారు. ప్రొఫెషన్ గురించి ఆయనకు బాగా తెలుసు.. ఏది చేసిన ప్రొఫెషన్‌లో భాగమే కదా.. అందులో పర్ఫెక్షన్ ఉండాలి కదా అని మాత్రమే ఇద్దరం ఆలోచిస్తాం” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. 2009లో శర్వానంద్ హీరోగా ‘రాజు మహరాజు’ అనే సినిమా విడుదలైంది. మోహన్ బాబు, రమ్యక్రిష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని హీరోయిన్నే ఈ బోల్డ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా. తొలి చిత్రం తోనే అందాలను ఆరబోసిన ఈ భామ మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసి.. “హమ్ తుమ్ శబానా” అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమా తరువాత “హేట్ స్టోరీ 2” అంగాగ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి ఆఫర్లను అందిపుచ్చుకుంది. బోల్డ్ పాత్రలతో గ్లామరసం పండించిన ఈ భామ అక్షయ్ తక్కర్ అనే బిజినెస్‌మేన్ ప్రేమలో పడింది. 2015లో అతన్ని పెళ్లాడిన ఈ భామ… పెళ్లి తరువాత కూడా బోల్డ్ పాత్రల్లో మెరిసింది.

Related posts