telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

53 ఏళ్ల సల్మాన్‌తో 21 ఏళ్ల యువతి రొమాన్స్…. సోనాక్షి కామెంట్స్

Sonakshi-Sinha

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కిన “ద‌బాంగ్ 3”. ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.ఈ సినిమాతో డైరెక్టర్, యాక్టర్ మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ తన కెరియర్ ప్రారంభిస్తోంది. 21 ఏళ్ల సాయి… 53 ఏళ్ల సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. వయసులో ఇంత తేడా ఉన్నవారు కలిసిన నటించడంపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీడియాతో ముచ్చటిస్తున్న సోనాక్షీని… ‘కుర్రహీరో ఈషాన్ ఖట్టర్‌తో మాధురి దీక్షిత్ రొమాన్స్ చేస్తే ఎవరైనా చూస్తారా? అని అడగగా.. దానికి సోనాక్షీ సమాధానమిస్తూ “నాకు తెలియదుగానీ ఇటువంటి జంట కొద్దిగా విచిత్రంగా అన్పిస్తుంది” అని అన్నారు. దాని తరువాత ఆమెను…వాళ్లిద్దరి మధ్య అఫైర్ ఉంటే విచిత్రంగా అనిపించవచ్చుగానీ… 53 ఏళ్ల సల్మాన్‌తో 21 ఏళ్ల యువతి రొమాన్స్ చేస్తే ఎందుకు విచిత్రంగా అనిపించదు? అని ప్రశ్నించగా… “50 ఏళ్ల వ్యక్తితో 21 ఏళ్ల యువతి రొమాన్స్ చేస్తున్నదంటే ఖచ్చితంగా నాకు విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే ఈ ప్రశ్నను సల్మాన్‌ను అడగాలి. అతను 53 ఏళ్ల వయసులోనూ ధృడంగా ఉంటూ, యవ హీరోయిన్లతో ఎలా రొమాన్స్ చేస్తున్నారో తెలుసుకోవాలి. నేనైతే ఇటువంటి విషయాన్ని ఆలోచించలేదు. నా వరకూ చూస్తే ఇది ఒక జాబ్. కొన్నేళ్లుగా సల్మాన్ తన కెరియర్ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అందుకే అతని సరసన నటించాలని అనుకుంటారు” అని సోనాక్షీ తెలిపింది.

Related posts