telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించకూడదా? : కంగనా

Kangana

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై, డ్రగ్స్ వ్యవహారంపై కంగనా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు తీరుపై, మరోవైపు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు చేస్తూ కంగనా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే ఇటీవల కంగనా ఆఫీసు అక్రమ కట్టడమంటూ బీఎంసీన (బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు గోడలను కూల్చేశారు. దీనిపై కంగనా ఏకంగా ముంబై హైకోర్టులో కేసు వేసింది. తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించేలా చూడాలని కంగనా కోరారు. అనంతరం మహా గవర్నర్ తో భేటీ అయ్యింది. ఆ తరవాత కంగన వరుస ట్వీట్ లతో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్వీట్ చేసింది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత పనులు ఆగిపోయాయి. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వంఎం కంగనా మధ్య వివాదం మాత్రం నడుస్తూనే ఉంది. తాజాగా బీఎంసీపై కంగనా మరోసారి మండిపడింది. తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా బీఎంసీ బెదిరిస్తోందని ఆమె ట్వీట్ చేసింది. తనను ఒంటరిని చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. తనకు సపోర్ట్ చేస్తే వారి ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించిందని చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారెవరూ ఒక్క కామెంట్ కూడా చేయలేదని, వారి ఇళ్లను కూల్చివేయద్దని విన్నవించింది. ముంబైలో గూండా ప్రభుత్వం నడుస్తోందని కంగన వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించకూడదా? అని మండిపడింది. వాళ్లు మనల్ని ఏం చేస్తారు? ఇళ్లను కూల్చి, చంపేస్తారా? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

Related posts