telugu navyamedia
సినిమా వార్తలు

భారీ వర్షాలతో తంటాలు పడుతున్న సెలెబ్రిటీలు

Akshay-Kumar

భారీ వర్షాలతో ముంబై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబై నగరంలో కురుస్తున్న వర్షాలకు సామాన్యులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ వర్షాలకు 48 గంటల పాటు విమాన సేవలు నిలిపివేయడంతో ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టినట్లు ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో పేర్కొంది. ఇదివరకే ముంబై వర్షాల కారణంగా విమానాలు రద్దు కావడంతో తనకు ఎయిర్ పోర్ట్ లో ఇరుక్కుపోయినట్లు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. యంగ్ హీరో వరుణ్ ధావన్ కారు ఓ రోడ్డులోని ఓ వరదలో చిక్కుకుపోయింది. వరద నీటిలోనే కారుని నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి చేరినట్లు వరుణ్ తెలిపాడు. హాట్ బ్యూటీ కృతి సనన్ కూడా విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.

Related posts