telugu navyamedia
telugu cinema news trending

ఆదిపురుష్ : లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యాక్షన్‌ హీరో !

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. అంతేకాకుండా సీత పాత్రలో కృతీసనన్ చేయనుందని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు లక్ష్మణుడి పాత్రలో ఎవరు చేయనున్నారన్నది మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ఈ పాత్రకు అనేక మంది బాలీవుడ్ యంగ్‌స్టార్ల పేర్లు వినిపించాయి. వాటిలో అర్జున్ కపూర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. బాలీవుడ్ యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ కూడా ఈ రేసులో ఉన్నాడట. ఈ వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై క్లారిటీ ఇంకా రాలేదు. ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో ఎవరు చేయనున్నారని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Related posts

బీజేపీ గెలిచిన మత్తులోనే ఉంది.. : పాక్

vimala p

రాష్ట్రానికి పట్టిన మద్యం మత్తు..వదిలితేనే అత్యాచారాలు ఆగుతాయి.. : మహిళా సంఘాలు

vimala p

సైకిల్ పై .. కలెక్టర్ .. ఆకస్మిక తనిఖీలు..

vimala p