telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరల్డ్ ఫేమస్ లవర్ : బొగ్గు గనిలో రంగు మణిరా… లిరికల్ వీడియో సాంగ్

WFL

సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను కె.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘మై లవ్’ను రిలీజ్ చేయగా… మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి “బొగ్గు గనిలో రంగు మణిరా…” అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ, కేథరిన్ తో కలిసి బొగ్గు గనుల్లో ఆడిపాడుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరూ వీక్షించండి.

Related posts