telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ విద్యార్థులకు ఊరట.. పరీక్షలు రద్దు

students masks exams

ఏపీలో గత కొన్ని రోజులుగా బోర్డు పరీక్షల గురించి చర్చ నడుస్తుంది . తప్పకుడా పరీక్షలు తప్పకుండ నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుబట్టింది. కానీ తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని తెలిపారు.. అనేక తర్జన భర్జనల అనంతరం పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఇంటర్ పరీక్షలని రద్దు చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. అంతేకాదు.. పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు… అయితే, మార్కుల అసెస్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపై హైపవర్ కమిటీని నియమించామన్నారు.. ఇక, తాము పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగానే ఉన్నాం… ఇదే విషయాన్ని అఫిడవిట్‌లోనూ చెప్పాం.. కానీ, సుప్రీం పెట్టిన డెడ్ లైన్ లోపల పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని.. అందుకే పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. దాంతో ఏపీ విద్యార్థులకు ఊరట లభిచింది.

Related posts