telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

బ్లూ టీ .. ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.. ?!

blue tea for health

ప్ర‌స్తుతం రకరకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది సాధార‌ణ టీ లు కాకుండా హెర్బ‌ల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మ‌న‌కు అనేక ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పుడు బ్లూ టీ అని మ‌రొక టీ వెరైటీ కొత్త‌గా వ‌చ్చి చేరింది. ఇంత‌కీ అస‌లు ఈ బ్లూ టీ అంటే ఏమిటి ? దాన్ని ఎలా తయారు చేస్తారు ? దానితో క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘బ్లూ టీ’ పౌడ‌ర్‌ను Clitoria ternatea అనే మొక్క పువ్వుల‌ను ఎండ‌బెట్టి త‌యారు చేస్తారు. నిజానికి ఈ మొక్క మ‌న చుట్టు ప‌రిస‌ర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. దీని పువ్వుల‌ను తెంచి నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేయాలి. అనంత‌రం ఆ పొడిని నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. దీనితో డికాషన్ త‌యార‌వుతుంది. దాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. రుచికి అందులో నిమ్మ‌ర‌సం లేదా తేనె క‌లుపుకోవ‌చ్చు.

blue tea for health* బ్లూ టీ తాగ‌డం వల్ల శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

* మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. అధిక బ‌రువు తగ్గుతారు.

* డ‌యాబెటిస్ ఉన్న‌వారు బ్లూ టీ తాగితే మంచిది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.

Related posts