telugu navyamedia
crime news

గ్యాస్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి

fire building

గుజరాత్‌ లోని గ్యాస్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. వడోదరలోని పద్రా తాలుకాలో గల గ్యాస్‌ తయారీ పరిశ్రమలో ఈ ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.

ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

రేపే హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం

vimala p

మరో మూడు రోజులు .. భారీ వర్ష సూచన.. : ఆర్టీజీఎస్‌

vimala p

అర్ధరాత్రి జూబ్లిహిల్స్ లో యువతి హల్‌చల్

vimala p